prabhas radhe shyam censor certificate‘రాధేశ్యామ్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ‘U/A’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా క్లారిటీ వచ్చింది. గత వారం వరకూ ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు వరకు ఉంది. కానీ వారం గడిచే లోపు 20 నిమిషాలను కట్ చేసేశారు. పైగా డైరెక్టర్ ను పక్కన పెట్టి మరీ.. నిర్మాతలు ఈ కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సినిమాలో అస్సలు బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా చూడాలని నిర్మాతలు వంశీ – ప్రమోద్ ముందు నుంచి కోరుతున్నారు.

కానీ, దర్శకుడు రాధాకృష్ణ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ సీన్స్ ను, అలాగే హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లోని కొన్ని సీన్స్ ను చాలా డిటైల్డ్ గా రాసి తెరకెక్కించాడట. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో నటించాడు. ఈ పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో వచ్చే మూడు సీన్స్ లో.. రెండు సీన్స్ ను కట్ చేశారని, అలాగే.. లవ్ ట్రాక్ లోని ల్యాగ్ సీన్స్ ను కూడా ట్రిమ్ చేశారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం కోసం అదనపు బడ్జెట్ ను కూడా కేటాయించారు. కానీ.. ఇది ఒక ప్యూర్ ప్రేమ కథ. మరి ఓ లవ్‌ స్టోరి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం చాలా అరుదు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా.

అందుకే.. సినిమాలో ఏ సీన్ బోర్ కొట్టినా.. మొత్తం సినిమా టాక్ పైనే ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టే.. సినిమాని చాలా టైట్ గా కట్ చేశారు. పైగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయట. అన్నట్టు ‘రాధేశ్యామ్’ కథ.. ఓ రియల్‌ స్టోరీ అని టాక్ ఉంది. సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ లో.. ఓ ట్రైన్‌ 106 మంది ప్యాసింజర్లతో రోమ్‌ కి స్టార్ట్ అవుతుంది అని.. అయితే, అ ట్రైన్‌ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు అని.. ఈ ట్రైన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ మొదలవుతుందని తెలుస్తోంది.

అసలు ఆ ట్రైన్‌ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు ఏమయ్యారు ? అనే మిస్టరీని ఛేదిస్తూ లైవ్ ఉంటే.. ప్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ లవ్ స్టోరీతో ‘రాధేశ్యామ్’ ప్రేమ కథ సాగుతుందట. కాగా హృద్యమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రానికి అమితాబ్‌, మహేష్ నేపథ్యగళం చక్కటి అలంకారంగా భాసిల్లనుంది.