National Award-Winning Guy for Prabhas' Setయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సక్సెస్ తరువాత గతంలో దక్షిణాది నుండి ఎవరు సాధించలేని ఘనత సాధించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ కు వచ్చిన ఫేమ్ ఇదివరలో రజినీకాంత్ కు కూడా దొరకలేదు అనడం అతిశయోక్తి కాదు. అయితే ఆ తరువాత కూడా ఇద్దరు చిన్న డైరెక్టర్లతో …. సుజిత్, రాధాకృష్ణలతో సినిమాలు ఒప్పుకున్నాడు.

సాహో ఇప్పటికే విడుదలయ్యి ప్లాప్ అయ్యింది. దానితో ఇప్పుడు ప్రభాస్ కు రాధాకృష్ణ సినిమా మీద అనుమానాలు మొదలయ్యాయి. దానితో ఆ స్క్రిప్ట్ కు అనేక మార్పులు చేర్పులు జరుపుతున్నారు. అలాగే అవసరమైతే రీ-షూట్స్ కి కూడా సిద్ధం అంటున్నారు. దీనికి కారణం రాధాకృష్ణ ఇన్ ఎక్స్పీరియన్స్ మీద ప్రభాస్ కు డౌట్ రావడమే.

పండగ తరువాత గానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదు అని సమాచారం. ఇది ఇలా ఉండగా ఇక తన కేరీర్ తో రిస్కులు తీసుకోకుండదని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. ఇక ముందు పెద్ద డైరెక్టర్లతో మాత్రమే పని చేస్తా అని ప్రభాస్ తన సన్నిహితులకు చెబుతున్నాడట. మొత్తానికి సాహో పరాజయంతో ప్రభాస్ కు తత్వం బోధపడినట్టు ఉంది.

సాహూ తెలుగుతో సహా అన్ని భాషలలో ఫెయిల్ అయినా హిందీలో మాత్రం బాగా ఆడింది. అక్కడ హిట్ అనిపించుకుంది. దీనితో బాలీవుడ్ లో తన కష్టం వృధా కాలేదు. జాన్ ఎలాగోలా హిట్ అయితే కేరీర్ దారిన పడినట్టే అని ప్రభాస్ భావిస్తున్నాడు. మరి జాన్ విడుదల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.