Prabhas master plan for Saaho movieయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా బాహుబలి 2 రేంజ్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. ప్రభాస్ దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టి సినిమాను విరివిగా ప్రమోట్ చేస్తున్నాడు.

సహజంగా నటులు సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి ముఖ్యనగరాలకు వెళ్లి సరిపెడతారు. ప్రభాస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా దేశంలోని 22 నగరాలను చుట్టి రాబోతున్నారు. డెహ్రాడూన్, లక్ నౌ, ఛత్తీస్గఢ్ లాంటి రెండవ టైర్ నగరాలకు కూడా వెళ్తున్నాడు. దీనికోసం చిత్ర నిర్మాతలు ఒక స్పెషల్ ఛార్టర్డ్ ఫ్లైట్ ను బుక్ చేశారట. 350 కోట్ల బడ్జెట్ తో సినిమా కావడంతో తొలి వారాంతం వసూళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతుంది చిత్ర బృందం.

దీనితో ప్రభాస్ మాక్సిమం కష్టపడుతున్నాడు. ఈ సినిమా థియేటర్లలో 290 కోట్లు రాబడితేనే సేఫ్ అనవచ్చు. అంటే దాదాపుగా 600 కోట్ల గ్రాస్ రాబట్టాలి. బాహుబలి 2 ఒక్క హిందీలోనే ఈ మొత్తం రాబట్టిన విషయం తెలిసిందే. దీనితో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ మాత్రం రాబట్టడం కష్టమేమి కాదు. ఈ సినిమా గనుక హిట్ అయితే ప్రభాస్ జాతీయ స్టార్ అయిపోవడం ఖాయం. గతంలో దక్షిణాది నుండి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఉత్తర భారత దేశంలో సక్సెస్ సాధించలేకపోయారు.