ప్రభాస్ ఫోన్ లో సోషల్ మీడియా యాప్ల్ కూడా ఉండవటయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియాలో ఒకానొక బిగ్ సూపర్ స్టార్ ఈరోజు. బాహుబలి సూపర్ సక్సెస్ తరువాత దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు సౌత్ లో పెద్దగా పాపులారిటీ లేదు. అయితే ప్రభాస్ కు దేశం నలుదిశలా ఫాలోయింగ్ ఉంది. ఆయన గత సినిమా సాహో తెలుగులో ఫెయిలైనా హిందీలో సక్సెస్ కావడం విశేషం.

ఈరోజు రేపూ సోషల్ మీడియా హావా నడుస్తుంది. స్టార్లు అంతా సోషల్ మీడియాలో దిగిపోయి పోటాపోటీగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకూ ట్విట్టర్ అకౌంట్ అనేదే లేదు. ఫేస్ బుక్ లో మాత్రం ఆయనకు ఒక వెరిఫైడ్ అకౌంట్ ఉంది. అది యాక్టీవ్ గానే ఉంచుతారు. ఫ్యాన్స్ తో ఆయనకు ఉండే కనెక్షన్ అదొక్కటే.

అయితే ప్రభాస్ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి అసలు పట్టించుకోడట. ఆ విషయం చెప్పింది ఆయనతో పని చెయ్యబోతున్న నాగ్ అశ్విన్ చెప్పారు. “ప్రభాస్ బాక్స్ ఆఫీస్ నంబర్లు, ఓపెనింగులు, సోషల్ మీడియా ఫాలోవర్లు ఏవీ పట్టించుకోరు. మనం ఏదేదో ఊహించుకుని వెళ్తాము కానీ ఆయన చాలా సింపుల్ గా ఉంటారు,” అన్నారు నాగ్ అశ్విన్.

“అసలు ఆయన ఫోన్ లో సోషల్ మీడియా యాప్లు ఉంటాయో కూడా అనుమానమే,” అని చెప్పడం విశేషం. ఇంత స్టార్ డమ్ వచ్చాకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీద… సోషల్ మీడియా ఫాలోయింగ్ మీద దృష్టిపెట్టకపోవడం అనేది చాలా పెద్ద విషయం. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ఈ ఏడాది జులైలో సెట్స్ మీదకు వెళ్తుంది.