Prabhas craze about carsఒక్కొక్కరికి ఒక్కో అంశంపై క్రేజ్, మోజు ఉండడం సహజమే. మరి ప్రస్తుతం ధియేటర్లలో ‘బాహుబలి 2’ ద్వారా ప్రభంజనం సృష్టిస్తోన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వేటిపై మోజు ఉంది? అంటే ‘డార్లింగ్’కు కార్లంటే మహామోజు. ఎంత మోజు అంటే… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ప్రభాస్ వద్ద ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ కార్లలో ముఖ్యంగా.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, జాగ్వార్ ఎక్స్ జే, బీఎండబ్ల్యూ ఎక్స్ 3 వంటి అత్యధిక విలువైన కార్లు ప్రభాస్ వద్ద ఉన్నాయి.

ఆయా కార్ల ఖరీదు విషయానికి వస్తే… మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ విలువ 4 కోట్ల నుంచి 8.5 కోట్ల వరకు ఉంది. అదే లగ్జరీగా ఉండే స్పోర్టింగ్ వెహికల్ జాగ్వార్ ఎక్స్ జే విలువ సుమారు 99 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇక బీఎండబ్ల్యూ ఎక్స్ 3 విలువ 44 లక్షల నుంచి 49 లక్షల వరకు ఉంది. ‘బాహుబలి’ సినిమాతో ఓ రేంజ్ లో పెరిగిపోయిన ప్రభాస్ పాప్యులారిటీకి ఈ మాత్రం రేంజ్ కార్లు ఉండడంలో తప్పులేదులే అంటున్నారు అభిమాన గణం. కాదనలేం మరి..!