Prabhas Clarity on marriageయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన మ్యారేజ్ ప్లాన్స్ పై స్పష్టత ఇచ్చారు. తన పెళ్లి గురించి పెరుగుతున్న మీడియా రిపోర్ట్స్ పై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. వివాహం పై తానేమీ విముఖంగా లేనని ఆయన చెప్పాడు. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కాని ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు అన్నారు ప్రభాస్.

అనుష్క, నిహారికా లేదా భీమావరం అమ్మాయితో సంబంధం ఉన్న వివిధ మీడియా రిపోర్ట్స్ గురించి ఆయన నవ్వేసి ఊరుకున్నారు. “నా కుటుంబ సభ్యులకన్నా, నాకు పెళ్లి చెయ్యాలనే ఆసక్తి మీడియాకే ఎక్కువగా ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు. నలభై ఏళ్ళ ప్రభాస్ టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ఒక పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదట అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినా, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అది అనుమానంగా మారింది. ఇప్పుడు ఆ సినిమా అసలు ఈ ఏడాది వస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది.

ఈ ఏడాది చివర్లో ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అది కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను తన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.