Prabhas breaks tamil producers council rulesయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చుట్టి వస్తున్నాడు. ఈ సినిమా గనుక హిట్ అయితే ప్రభాస్ జాతీయ స్టార్ అయిపోవడం ఖాయం.

నిన్న చెన్నై వెళ్ళాడు ప్రభాస్… ఇటీవలే తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్ని కొత్త రూల్స్ ను ప్రకటించింది. తమిళ జర్నలిస్టులకు ఇక ముందు కవర్లు ఇవ్వకూడదని, వారికి భోజనాలు పెట్టకూడదని నిర్మాతలకు హుకుం జారీ చేశారు. అయితే సాహూ టీం ఈ రూల్స్ అన్నింటినీ ఉల్లంఘించి అక్కడి మీడియాకు దండిగా ముట్టజెప్పిందంట చిత్ర బృందం. చెన్నైలోని అడయార్ లోని స్టార్ హోటల్ లాటిస్ లో మందూ విందుతో అభిషేకం చేశారట. ఇది అక్కడ చర్చనీయాంశం అయ్యిందట.

విడుదలకు ముందే 350 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అన్నీ కలిపి 500 కోట్లు రాబట్టిందట. ఈ సినిమా థియేటర్లలో 290 కోట్లు రాబడితేనే సేఫ్ అనవచ్చు. అంటే దాదాపుగా 600 కోట్ల గ్రాస్ రాబట్టాలి. బాహుబలి 2 ఒక్క హిందీలోనే ఈ మొత్తం రాబట్టిన విషయం తెలిసిందే. దీనితో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ మాత్రం రాబట్టడం కష్టమేమి కాదు. సాహూ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే చాలా చోట్ల మొదలయ్యింది. టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ ఐన సెకండ్లలోనే హాట్ కేకులాగా అమ్ముడు పోతున్నాయి.