Prabhas Baahubali 2‘బాహుబలి’ సినిమా కోసం తన పర్సనాలిటీని కాపాడుకునేందుకు ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ చూపిన అంకిత భావం తనను షాక్ కు గురి చేసిందని ప్రముఖ బాడీ బిల్డర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభాస్ కు ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్ గా పని చేసిన లక్ష్మారెడ్డి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘బాహుబలి’ చిత్రం కోసం ప్రభాస్ తీసుకునే ఆహారం, వర్కవుట్స్ అన్నీ కూడా తన పర్యవేక్షణలోనే నాలుగేళ్ల పాటు జరిగాయని అన్నారు.

‘బాహుబలి 1’లో మహేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ కు ఎగ్ వైట్స్, చికెన్, నట్స్, అల్మండ్స్, చేపలు, కూరగాయలు వంటి వాటిని ఆరు సార్లు ఆహారంగా ఇచ్చామని, ‘బాహుబలి 2’లో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ వంద కిలోల బరువు పెరిగాడని, చీజ్, మటన్ వంటి ఆహారాన్ని ఎనిమిది సార్లు అందించామని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ప్రభాస్ చూపించిన చిత్తశుద్ధి ప్రశంసించదగినదిగా కొనియాడారు.