Prabhas-Baahubali-2 Day 1 collections‘బాహుబలి: ద బిగెనింగ్’ సినిమాతో మెదలుపెట్టిన రాజమౌళి ప్రభంజనం ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ వరకు కొనసాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులన్నీ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై, రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఓవరాల్ కలెక్షన్లను, ప్రీ బుకింగ్స్‌ తోనే ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ కొల్లగొట్టడం విశేషం.

యుఎస్ లో “ఖైదీ నెంబర్ 150” సినిమా ఓవరాల్ గా 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిందని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. ఒక్క తెలుగు సినిమా రికార్డులే కాదు, బాలీవుడ్ సినిమా రికార్డులను కూడా జక్కన్న తిరగరాస్తున్నాడని ఇప్పటికే ఖరారైంది. ఇదిలా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ‘బాహుబలి 2’ ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలోనే ఎవరూ అందుకోలేని రీతిలోనే ఉన్నాయని సమాచారం.