Prabhas Car, Prabhas Car Registration, Prabhas Car RTA Office, Prabhas New Car No TS 09 EN 7567, Prabhas New Car Range Rover, Prabhas Range Rover Number‘బాహుబలి’ సినిమా ద్వారా ఆల్ టైం భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శుక్రవారం నాడు ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో సందడి చేసారు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేసారు.

2.82 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లేటెస్ట్ మోడల్ రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రభాస్ నుంచి డిజిటల్ సంతకం, ఫోటో తదితర ఫార్మాలిటిస్ ని అధికారులు పూర్తి చేసారు. అనంతరం కొత్త కారు రేంజ్ రోవర్ కు ‘టీఎస్ 09 ఈఎస్ 7567’ అనే నెంబరును కేటాయించారు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చిన ప్రభాస్ ను చూసేందుకు సాధారణ జనం ఎగబడ్డారు.