Prabhas - Sathyarajబ్రహ్మచారిగా కనిపించిన కట్టప్పకు కొడుకున్నాడా? కొంపదీసి రాజమౌళి ఏమైనా ‘బాహుబలి-3’కి ప్లాన్ చేస్తున్నాడా? కొడుకు కోసం ‘బాహుబలి’ని ‘కట్టప్ప’ సలహా అడగటం ఏంటి? అనుకుంటున్నారా? రీల్ లైఫ్ లో కాదు లెండి. రియల్ లైఫ్ లో..!

తెలుగులో వచ్చిన ‘క్షణం’ చిత్రాన్ని తమిళంలో తన కుమారుడు శిబి హీరోగా రీమేక్ చేయాలని భావించిన సత్య రాజ్ ప్రభాస్ ను సలహా అడిగారట. ఈ చిత్రం 8న రిలీజ్ కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సత్యరాజ్, తాను ప్రభాస్ సలహా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

శిబి తన వద్దకు వచ్చి ‘క్షణం’ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడని, ఆ సమయంలో తాను ‘బాహుబలి’ షూటింగ్ లో ఉన్నానని, ‘క్షణం’ గురించి ప్రభాస్ ను అడుగగా, సినిమాలో విభిన్నత ఉందని, స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉందని, చేయవచ్చని చెప్పాడని, ప్రభాస్ మాటలు తనలో కాన్ఫిడెన్స్ పెంచడంతోనే, సినిమా కూడా చూడకుండా, రైట్స్ కొని రీమేక్ చేశామని చెప్పుకొచ్చాడు. అదీ అసలు సంగతి.