Adipurush three times bigger than Bahubaliయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ ముంబైలో ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టింది. మొదటిగా సైఫ్ అలీ ఖాన్ మీద సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఆగష్టు, సెప్టెంబర్ నాటికి గానీ ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. ఈలోగా ప్రభాస్ రాధే శ్యామ్, సలార్ షూటింగ్ల పనిలో ఉంటాడు.

ఇక పోతే ఆదిపురుష్ ప్రభాస్ సెన్సషనల్ సినిమా… బాహుబలి కంటే వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత కలిగిన సినిమా అని అంటున్నారు. బాహుబలిలో మొత్తంగా 2,500 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే ఆదిపురుష్ లో ఏకంగా 8,000 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయట. అంటే బాహుబలి కంటే మూడు రేట్ల కంటే ఎక్కువగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఆదిపురుష్ ఉంటుందన్నమాట.

వీఎఫ్ఎక్స్ పరంగా సినిమా క్లిక్ అయితే ఇక అభిమానులకు కన్నులపండువగా ఉండబోతుంది ఈ సినిమా అనడంలో ఎటువంట సందేహం లేదు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన టి సిరీస్ 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను బ్యాంక్రోలింగ్ చేస్తోంది. ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ వారాంతపు స్పెషల్‌గా 2022 ఆగస్టు 11 న విడుదల కానుంది.

సినిమా విడుదలకు ఏడాది పైగా ఉన్నా ఇంత వీఎఫ్ఎక్స్ ఉంది అంటే సినిమా మీద కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఉండదని చెప్పలేం. ఈ సినిమా లో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. సీత పాత్ర ఈ సినిమాలో ఎంతో పరాక్రమ వంతంగా కనిపిస్తుందట. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చేకొద్దీ అభిమానులలో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది.