Pawan-Kalyan-director krishపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా తీస్తున్న సినిమాల పట్ల అభిమానులు హ్యాపీగా లేరు. కేవలం డబ్బు సంపాదించడానికే సినిమాలు చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నట్టుగానే ఆ సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పవన్ ఎక్కువగా రీమేక్ల మీదే దృష్టిపెడుతున్నాడు.

వకీల్ సాబ్ రీమేక్ చిత్రమే. తరువాత చెయ్యబోయే చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కూడా రీమేక్ చిత్రమే. కొద్దో గొప్పో క్రిష్ తో చేస్తున్న చిత్రం ఎంతో కొంత మంచి చిత్రం. అది పవన్ కేరీర్ లో మొదటి పీరియడ్ సినిమా. క్రిష్ సినిమా అంటే ఎంతో కొంత విషయం కూడా ఉంటుంది. కానీ ఆ సినిమాని పవన్ సీరియస్ గా తీసుకోవడం లేదు.

కరోనా కారణంగా దాదాపుగా ఆ సినిమా షూటింగ్ తొమ్మిది నెలలు నిలిచిపోయింది. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టి ఒక వారం షూట్ చేసి మళ్ళీ ఆపేశారు పవన్. తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ మొత్తం షూటింగ్ పూర్తయ్యాకా గానీ ఈ చిత్రం మళ్ళీ మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. దీనితో అభిమానులు చాలా నిరాశపడుతున్నారు.

క్రిష్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం మరో మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. సహజంగా ఇలా ఆపి చేసే సినిమాలు క్వాలిటీ కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఎక్కువ గ్యాప్ల వల్ల హీరో క్యారెక్టర్ లో సరిగ్గా ఇమడలేరు కూడా. కాబట్టి అభిమానులకు ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు.