Pawan Kalyan Interview-3యువతరం క్రేజీ నటుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ తెలియనిది కాదు. మరి అలాంటి పవర్ స్టార్ తాజాగా తన మనసులోని భావాలను ఒక విలేఖరి ద్వారా తన అభిమానుల ముందుంచారు. ఇటీవల కాలంలో పవన్ సినీ కెరీర్, రాజకీయ రంగాలపై వచ్చిన సందేహాలకు, ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూ జవాబిచ్చింది. అంతేకాదు, పవన్ సినిమాలకు అమితంగా ఇష్టపడే అభిమానులకు తీరని శోకాన్ని కూడా మిగిల్చింది. ఇదే సమయంలో పవన్ ‘జనసేన’ కోసం ఎదురు చూస్తున్న అశేష సేనానిని సంతోషపెట్టింది.

“నేను అనుకోకుండా నటుడిని అయ్యాను, నిజానికి నేను ఒక రైతుగా బ్రతకాలనుకున్నాను. సినిమాలలో నేను భారీ భారీ సందేశాలు ఇస్తుంటాను. అయితే అదే దానిని నేను నిజజీవితంలో ఎందుకు పాటించలేకపోతున్నాను? అని ఎప్పుడూ మనోవేదనకు గురవుతుంటాను. నేను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి గల ఏకైక కారణం… నా నిజ జీవితంలో కూడా నా గళం వినిపించడానికి మాత్రమే. సినిమాలే జీవితం కాదు, జీవితం అనేది సినిమాలకు మించి ఉంటుంది.”

“భావవ్యక్తీకరణ అన్నింటి కంటే ముఖ్యమైనది. నాకు నేను నిజాయితీగా ఉండాలనుకుంటాను. నిజ జీవితంలో అన్ని రకాల పాత్రలు ఉంటాయి, అయితే నేను ఒక చెడ్డ వ్యక్తిగా మాత్రం ఉండదలుచుకోలేదు. నిజంగా నేను ఒక గొప్ప నటుడ్ని మాత్రం కాదు. నేను అందరి దగ్గర నుండి అభిప్రాయాలు తీసుకుంటుంటాను, కానీ అందులో నిజమైన అభిప్రాయాలు రావడం మాత్రం కష్టమే.”

“ఖాళీ సమయాల్లో నేను హార్డ్ వర్క్ చేయట్లేదని ప్రజలు భావిస్తుంటారు, కానీ అది నిజం కాదు. ఇండియన్ సినిమాల్లో చేయడానికి చాలా అలసిపోతున్నాను. అన్ని సమపాళ్ళలో ఉండడానికి ఎంతో కష్టపడుతుంటాను. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాను. నాకు చట్టం మరియు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, అయితే అవి ఇంకా బాగా ఉండాలని ఆశిస్తాను.”

“ప్రస్తుతం సినిమాల విషయాల్లో నేను చాలా గందరగోళానికి గురవుతున్నాను. కానీ, రాబోయే సంవత్సరాలలో పూర్తిగా వదిలేయలనుకుంటున్నాను. రాజకీయాల విషయంలో నా ఆత్మసాక్షికి కట్టుబడకుండా ఉండలేను. ఒక్కసారి క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే, సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను. నటనను వదిలేసినప్పటికీ, నేను రచయితగా కొనసాగుతుంటాను. నాకు రాయడమంటే చాలా ఇష్టం. నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడమే నా మంత్రం. అంతకు మించి ఏమీ లేదు.”

ఇలా పవన్ తన మనోభావాలను వ్యక్తపరుస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “పవన్ తో మాట్లాడడం చక్కని అనుభూతిని మిగిల్చిందని, స్పూర్తిదాయకంగా ఉందని” ఈ ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ అనుమప చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించింది. పవన్ చెప్పిన ఈ అభిప్రాయాలలో కొన్ని విషయాలు గతంలో చెప్పినప్పటికీ, సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనేది ఇక అధికారికమయ్యింది. బహుశా అభిమానులను మానసికంగా సిద్ధంగా ఉంచాలన్నది పవన్ అభిమతమేమో..!

Pawan Kalyan Interview-1

Pawan Kalyan Interview-2