pawan kalyankajal sardaar2016 కొత్త ఏడాది సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసాయి. అయితే, పవన్ అభిమానులకు వినపడుతున్న చేదు వార్త ఏమిటంటే… ప్రస్తుతం చిత్ర యూనిట్ అలాంటి ప్లానింగ్ ఏమీ చేయడం లేదట. దీంతో ఇప్పటివరకు కొత్త టీజర్ తో కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న పవన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు క్రిస్మస్ నుండే కొత్త ఏడాది సంబరాలను జరుపుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రిన్స్ బావ నటించిన “భలే మంచి రోజు” సినిమాకు ‘సూపర్ హిట్’ టాక్ రావడంతో, ‘శ్రీమంతుడు’ తర్వాత ప్రిన్స్ ఫ్యామిలీ మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుందని పండగ చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా మంచి సక్సెస్ కోసం వేచిచూసిన సుధీర్ బాబుకు ఈ క్రిస్మస్ “భలే మంచి రోజు” అయ్యిందని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.