Power Holidays in APఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలతో పాటు పరిశ్రమలకు “పవర్” కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు “పవర్ హాలిడే” అధికారికంగా ప్రకటించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీని పై తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వానికి సెటైర్లతో షాక్ ఇచ్చారు.

హాలిడే సీఎం జాలీ రెడ్డి,మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో … ”క్రాప్ హాలిడే, జాబ్ హాలిడే, పవర్ హాలిడే”లతో శాశ్వతంగా రాష్ట్రంలో ‘అభివృద్ధికి హాలిడే’ అంటూ సెటైరికల్ గా పోస్ట్ చేసారు. జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ హాలిడే, అభివృద్ధి హాలిడే ఇచ్చారు, కానీ తాను ఇస్తానన్న “మద్యం” హాలిడే మాత్రం ఇవ్వకుండా ప్రజలను దోచుకుంటూ ‘జాలీ’గా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ లోకేష్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

రైతులకు సకాలంలో అందని సాగు నీరు., అటకెక్కిన రైతు లాభసాటి మద్దతు ధర అంశాలపై ప్రభుత్వ ఎందుకు దృష్టి పెట్టలేక పోతుంది? వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించిన మీ ప్రభుత్వాన్ని చూసా మేం అసూయ..,పడేది జగన్ గారు అంటూ లోకేష్ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ అందచేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు.

ప్రతి సంవత్సరం “జాబ్ క్యాలెండరు” అంటూ నిరుద్యోగులకు ఆశలు కలిపించించి మీపార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ కు బదులు “జాబ్ హాలిడే” ప్రకటించారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా కల్పించలేని మీ నాయకత్వాన్ని చూసా మేము అసూయ..,పడేది అంటూ టీడీపీ నాయకులు నిన్నటి జగన్ ప్రసంగానికి కౌంటర్ అటాక్స్ ఇచ్చే పనిలో పడ్డారు.

‘పరిశ్రమల శాఖ మంత్రి’ కంటే ముందే ‘పరిశ్రమలకు’..,పవర్ హాలిడే అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి వర్యులు అంటూ వ్యంగ్యంగా సాగదీసారు విపక్షాలు. వారంలో ఇక ఒక రోజు ‘పూర్తిగా’.., పరిశ్రమలకు కరెంట్ కోత విధించబడుతుంది. ప్రాసెసింగ్ పరిశ్రమలో కరెంట్ వినియోగం సగమే వాడుకోవాలి.వాణిజ్య సంస్థలలో సగం ఏసీలు బంద్ చేయాలి. ప్రకటనల సైన్ బోర్డుల లైట్స్ ఆపాలి.

‘ఎనిమిదేళ్ల’ తరువాత తొలిసారిగా రాష్ట్రంలో పవర్ హాలిడే ప్రకటించింన వైసీపీ ప్రభుత్వం.రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలను ఉక్కపోతలకు గురి చేస్తూ.,పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తున్న మీ వైసీపీ నాయకత్వాన్ని చూసా, 40ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మా నాయకుడు చంద్రబాబు అసూయ..,పడేది అంటూ తెలుగు తమ్ముళ్లు, టీడీపీ కార్యకర్తలను చూసి వైసీపీ నాయకులే అసూయ పడే అంతలా ట్రోల్స్ చేస్తున్నారు.

40సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు రాబోయే 20సంవత్సరాల “భావితరాల భవిష్యత్” కోసం అలోచించి నిర్ణయాలు తీసుకుంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని,రాష్ట్ర భవిషత్ ని మరో 25సంవత్సరాల వెనుకకు నెట్టిందని…, ఈ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోనా మీ పై, మీ ప్రభుత్వం పై అసూయ పడేది? అంటూ టిడిపి నేతలు జగన్ మీద విరుచుకుపడ్డారు.

వైసీపీ మంత్రులకు ఇప్పుడు మాజీలుగా ప్రమోషన్ ఇచ్చి చివరకు ఆ పార్టీ నాయకులకు కూడా పవర్ కట్ చేసి “పవర్ హాలిడే” ఇచ్చారు జగన్. అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా ‘జగన్ మోసపు రెడ్డి’కి “పవర్ హాలిడే” ప్రకటిస్తారని జోస్యం చెప్పారు తెలుగుతమ్ముళ్లు. అప్పుడు ఈ హాలిడే సీఎం తనకు నచ్చిన చోట జాలీగా ఎంజాయ్ చేయవచ్చన్నారు.