Koratala Siva Keeps up His Promise to Posani Krishna Muraliనంది అవార్డులపై జరిగిన, జరుగుతున్న రాజకీయం తెలియనిది కాదు. అంతకుముందు కూడా నంది అవార్డుల విషయంలో అనేక సినిమాలకు అన్యాయం జరిగినా.., లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయం. ఇక ‘మనం’ వంటి క్లాసిక్ సినిమాకు జరిగిన అన్యాయం పక్కన పెడితే, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలన్న ఆకాంక్ష విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిలో ఇట్టే గమనించవచ్చు.

విమర్శలు చేసిన వారిలో ఎక్కువ మంది “మనం” సినిమాను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకున్న వారే ఎక్కువ. రాజకీయంగా టిడిపిని, వ్యక్తిగతంగా బాలకృష్ణను దుయ్యబడుతూ పరోక్షంగా జగన్ పై తమకున్న ప్రేమను, అభిమానాన్ని చాటిచెప్పడంలో సక్సెస్ అయ్యారు. కానీ పోసాని కృష్ణమురళీ స్టైల్ వేరు కదా! వచ్చే ఎన్నికలలో తాను వైసీపీ అధినేతకే ఓటు వేస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించే పోసాని నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించాడు.

ఇతరుల మాదిరి డొంక తిరుగుడు వ్యవహారం పోసాని వద్ద ఉండదు గనుక, నేరుగా టిడిపి సర్కార్ ను, నారా లోకేష్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ… తాను అవార్డును స్వీకరించబోనని ప్రకటించారు. ఇప్పటివరకు విమర్శలు చేసిన వారిలో నేరుగా జగన్ కు సపోర్ట్ చేస్తూ టిడిపిని ప్రశ్నించింది ఒక్క పోసానినే అని చెప్పకతప్పదు. ఈ రకంగా జగన్ కు పూర్తి న్యాయం చేసిన సెలబ్రిటీగా పోసాని నిలిచారు.