Posani Krishna Murali - Jaganసినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి అంశం మీదా చంద్రబాబు మీద విరుచుకుపడుతూ ప్రతిపక్షం నాటి నుండి ఇప్పటివరకూ పోసాని వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్య జగన్ కొందరు నటులకు పదవులు ఇచ్చి తనకు ఇవ్వలేదని ఆయన అలిగారని వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని రోజులుగా ఆయన జగన్ కు ఫేవర్ గా మరోసారి మీడియాలో యాక్టీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోసాని తన మనసులో మాట బయటపెట్టారు. వీలైతే తను ఆంధ్రప్రదేశ్ లో స్టుడియో ఏర్పాటు చేస్తానంటున్నారు పోసాని. దీనితో ఆయన తొందరలోనే ముఖ్యమంత్రి జగన్ ని కలిసి స్టూడియోకి భూమి అడిగే అవకాశం ఉంది.

“ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఓ స్టుడియో ఏర్పాటుచేయాలనేది నా చిన్న కొడుకు ఆలోచన. ఈమధ్యే తన ఆలోచనను నాతో పంచుకున్నాడు. అప్పటివరకు నాకు ఆ ఆలోచన రాలేదు. నిజమే, అది మంచి ఆలోచనే. ఏపీలో స్టుడియో ఏర్పాటుచేయొచ్చు. ఓ ఐదు ఎకరాలు ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఇండస్ట్రీలో 35 ఏళ్లుగా ఉంటున్నాను. స్టుడియో ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వాన్ని స్థలం కోరే హక్కు నాకు ఉంది,” అని చెప్పుకొచ్చారు.

ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమంలో దర్శకుడు ఎన్ శంకర్ ప్రముఖ పాత్ర పోషించినందుకు గానూ అక్కడి ప్రభుత్వం ఆయనకు నామమాత్రపు రేటుకు భూమి కేటాయించింది. అయితే దానిని అక్కడి హైకోర్టు తప్పుపట్టింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.