Poonam Pandey Sugar Biscuit Song-సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ హాట్ పిక్స్ తో సందడి చేసే పూనం పాండే త్వరలో “ది జర్నీ ఆఫ్ కర్మ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభం కాగా, తొలుత టీజర్ ను విడుదల చేసారు, తాజాగా ‘షుగర్ బిస్కెట్’ పేరుతో ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.

శక్తికపూర్ – పూనం పాండేలపై చిత్రీకరించబడిన ఈ సాంగ్ ‘అడల్ట్’ కంటెంట్ తో కూడుకుంది. రొమాంటిక్ గా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నమో ఏమో గానీ, విజువల్ గా ఈ పాట అంతకుమించి ఉంది. అయితే ఈ స్థాయిలో అందాల ప్రదర్శన వీక్షకులకు జుగుప్సాకరంగా కూడా ఉంటోంది. అయినా 66 ఏళ్ళ శక్తి కపూర్ – 27 ఏళ్ళ పూనంపాండేల నడుమ ఇలాంటి పాటేంటి… ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ కాకపోతేనూ..!?