poolarangadu-beauty-in-supreme-movieమెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీం’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ‘పటాస్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అనీల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి మాస్‌ మసాలా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. తేజూకు జోడీగా హాట్‌ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో ముద్దుగుమ్మ కూడా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ‘పూలరంగడు చిత్రం’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఇషా చావ్లా ‘సుప్రీం’లో ఐటెం సాంగ్‌ చేయబోతుంది.

‘మిస్టర్‌ పెళ్లి కొడుకు’ మరియు ‘జంప్‌ జిలాని’ చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో మళ్లీ ఆఫర్లు రాలేదు. దాంతో అటు తమిళం మరియు మలయాళంలో ఈమె అడపా దడపా చిత్రాు చేస్తూ వెళ్తోంది. తాజాగా ఈ అమ్మడికి మరోసారి టాలీవుడ్‌ నుండి పిలుపు రావడంతో ఫుల్‌ హ్యాపీగా ఉంది. ‘సుప్రీం’లో ఐటెం సాంగ్‌ చేసి తెలుగులో మళ్లీ అవకాశాలు దక్కించుకోవాలని కోరుకుంటుంది. అతి త్వరలోనే ‘సుప్రీం’ కోసం ఐటెం సాంగ్‌ చిత్రీకరణ జరుగబోతుంది. ఆ షూటింగ్‌లో ఇషా చావ్లా పాల్గొనబోతుందని చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా ఐటెం సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.