Pooja Hegde remuneration for valmiki movieమొన్న ఆ మధ్య పూజా హెగ్డే వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్రం నుండి వాక్ అవుట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అనుకున్న మాట వాస్తవమే గానీ చిత్ర యూనిట్ ఆమెను ఎలాగోలా కన్విన్స్ చేసి వాల్మీకిలో నటింప చేస్తున్నట్టు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కొన్ని కీలక టాకీ సన్నివేశాలు షూట్ చేస్తుంది చిత్ర బృందం. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

వాల్మీకి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా చిన్నది. ఒక సాంగ్, కొన్ని సీన్లు. జస్ట్ 10 రోజుల వర్క్. ఆ మాత్రం దానికి అమ్మడు కోటిన్నర పట్టేసిందట. డిమాండ్ ఉండగానే కాసిన్ని డబ్బులు వెనకేసుకోవాలని చూస్తున్నట్టుంది ఈ కన్నడ భామ. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగింది.

గ్యాంగ్ స్టర్ సినిమాకు ‘వాల్మీకి’ అనే పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. వారి గొడవ కారణంగా అనంతపురంలో జరగాల్సిన షూటింగ్ ఆగిపోయింది. సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టే సమయానికి ఈ వివాదం మళ్ళీ తెర మీదకు వస్తుందేమో అని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వంటి వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో తన హిట్ల పరంపరను కొనసాగించాలని ఆరాటపడుతున్నాడు.