Pooja Hegde next target Tamil film industryపూజా హెగ్డే తెలుగు సినిమాలో బాగా బిజీ హీరోయిన్. స్టార్ హీరోలందరికీ ఆమె ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్. ఆమె ప్రస్తుతం ప్రభాస్ తరువాతి చిత్రంలో నటిస్తుంది. అలాగే అఖిల్ అక్కినేనితో అతని తదుపరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో జత కట్టింది. ఈ సినిమా షూటింగ్ ఆమె దాదాపుగా పూర్తి చేసింది.

ఈ నటి ఇటీవల సల్మాన్ ఖాన్ కబీ దీపావళి కబీ ఈద్ చిత్రంతో బాలీవుడ్‌లో పెద్ద ఛాన్స్ కొట్టేసింది. ఈ నటి గతంలో కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు, ఈ నటి తమిళ చిత్ర పరిశ్రమలో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది సూర్య సరసన ఆమె ఒక సినిమా చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి సింగం హరి దర్శకత్వం వహించనున్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం షూట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆమె డేట్స్ గురించి స్పష్టంగా తెలియకపోవడంతో పూజా ఇంకా అగ్రిమెంట్ పై సంతకం చేయలేదని వర్గాలు చెబుతున్నాయి.

లాక్డౌన్ ముగిసిన తర్వాత షూటింగులు తిరిగి ప్రారంభమైన తర్వాత మాత్రమే ఈ చిత్రంపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ సినిమా గనుక చేసి హిట్ కొడితే కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి ఎదురు లేకుండా పోతుంది.