అఖిల్ సినిమాలలో ఆ లోటు తీర్చిన పూజా హెగ్డే

Most Eligible Bachelorఅఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శరవేగంగా ముస్తాబు అవుతుంది. వేసవి కనుక ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమా ప్రమోషన్స్ కూడా పెంచారు. తాజాగా సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ మోడరన్ లుక్ లో పూజా యువతను ఆకట్టుకునేలా ఉంది.

అఖిల్ సరసన నటిస్తున్న మొట్టమొదటి స్టార్ హీరోయిన్ పూజానే అని చెప్పుకోవాలి. ఇప్పటివరకూ అఖిల్ సినిమాలలో యువ హీరోయిన్లే ఉండేవారు. కథ ప్రకారం సూట్ అయ్యే వారే అయినా వారి వల్ల ఒక పెద్ద సినిమాకు రావాల్సిన గ్లామర్ రావడం లేదు. ఇప్పుడు ఆ లోటు పూజా భర్తీ చేస్తుంది. పైగా ఇప్పుడు ఆమెకు ఆడియన్స్ లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.

అయితే గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Allu Arjun's Well Planned And Executed PR CampaignDon't MissAllu Arjun's Well Planned And Executed PR CampaignStylish Star Allu Arjun is the Chief Guest for Naga Shaurya's Varudu Kaavalenu Pre-release event...Allu Arjun about pushpa movieDon't Missఇదేంటి బన్నీ ఇలా అనేశాడు !త్వరలో రాబోతున్న బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో 'పుష్ప' ఒకటి. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న...hardwork done by tdp janasena supporters pawan kalyan thefting thatDon't Missకష్టం టీడీపీ ది...కట్టింగ్ పవన్ కళ్యాణ్ ది !ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ గా అడ్డాగా మారుతోందని , ఏ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన దాని మూలాల ఆంధ్రానుండే...chiranjeevi meher ramesh new movie starts from november 11thDon't Missముహూర్తం ఖరారు ... ఫ్యాన్స్ భయపడుతున్నారు !మెగాస్టార్ తో మెహర్ రమేష్ 'భోళా శంకర్' అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి...Samantha Case: Justice Not Delivered?Don't MissSamantha Case: Justice Not Delivered?Kukatpally Metropolitan Court had delivered its final judgment in Samantha's case. The court has ordered...

Mirchi9