గత కొన్ని రోజులుగా తన బికినీ కాస్ట్యూమ్స్ తో నెట్టింట తెగ హంగామా చేస్తోన్న టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక ఫోటోను మించిన విధంగా మరొక ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

బ్రౌన్ కలర్ బికినీ తో ప్రారంభమైన ఈ ఒరవడిలో తదుపరి ఆరంజ్ లో అందాల విందు చేయగా, తాజాగా వైట్ కలర్ స్విమ్ సూట్ లో అదరగొడుతోంది. ఇప్పటివరకు సందడి చేసిన అన్ని ఫోటోలలో కల్లా… బ్యాక్ గ్రౌండ్ బీచ్ తో ఈ వైట్ స్విమ్ సూట్ పిక్ వీక్షకులకు కన్నులవిందుగా మారింది.

నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ బ్యూటీ, హాలిడే మూడ్ లో ఉంది. టూర్ ను ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఈ సీరియల్ స్విమ్ సూట్స్ ఫోటోలకు ఇక బ్రేక్ పడినట్లే! “రాధే శ్యామ్” రిలీజ్ కు దగ్గర అవుతుండడంతో నెక్స్ట్ ప్రమోషన్స్ లో ప్రత్యక్షం అవనుంది.