Pooja Hegde back to Valmiki shootమొన్న ఆ మధ్య పూజా హెగ్డే వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్రం నుండి వాక్ అవుట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అనుకున్న మాట వాస్తవమే గానీ చిత్ర యూనిట్ ఆమెను ఎలాగోలా కన్విన్స్ చేసి వాల్మీకిలో నటింప చేస్తున్నట్టు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కొన్ని కీలక టాకీ సన్నివేశాలు షూట్ చేస్తుంది చిత్ర బృందం. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట. అయితే ఆగస్టులో బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ లేక సెప్టెంబరులో సినిమా విడుదల చేస్తున్నారు. ముందే షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్, పుబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. తమిళ హీరో అధర్వ మురళి కీలకపాత్ర పోషిస్తున్నారు. వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కాస్త నెగిటివ్ షేడ్ వున్న రఫ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక.

దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగింది. గ్యాంగ్ స్టర్ సినిమాకు ‘వాల్మీకి’ అనే పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత గొడవ సద్దుమణిగింది. సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టే సమయానికి ఈ వివాదం మళ్ళీ తెర మీదకు వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.