ponniyin Selvan tamil audience fires on Telugu Audienceమణిరత్నం కళాఖండం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. తమిళ ప్రేక్షకులు ఇది చరిత్ర సృష్టించే సినిమా అని పొగుడుతుండగా, తెలుగు ప్రేక్షకులు మాత్రం ఏమంత బాగోలేదని చెప్తున్నారు. ఇది విని తట్టుకోలేని తమిళ ప్రేక్షకులు తెలుగు వాళ్ళకి ఐటెం సాంగులు, నేల విడిచి సాము చేసే పోరాటాలు ఉంటేనే హిట్ చేస్తారని, పొన్నియిన్ సెల్వన్ లో ఉన్న గొప్పతనం తెలుగు వాళ్ళు గుర్తించటం లేదని దెప్పి పొడుస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ కల్కి రాసిన చోళుల కథ, తమిళ ప్రజల కథ, వాళ్ళ ఆచారాలు, పాటలు, పేర్లు వింతగా ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాలో పాత్రల పేర్లను తెలుగు వారు పలకడమే కష్టం. అయినా మణిరత్నం మీద అభిమానంతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి, సినిమా చాలా నెమ్మదిగా సాగటం, చెప్పుకోవడానికి ఒక మంచి పాటగానీ, ఫైటుగానీ లేకపోవడం తెలుగు ప్రేక్షకులని నిరాశకు గురిచేసింది.కథలో ఏమాత్రం ఆసక్తి కరమైన మలుపులు లేకుండా సినిమా వెలుతూ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.

తమిళ ప్రేక్షకులు బాహుబలిని ఆదరించారంటే అది రాజమౌళి గొప్పతనం. రాజమౌళి బాహుబలి సినిమాని భాషాబేధం లేకుండా ప్రపంచమంతా ఆదరించే విధంగా మలిచాడు. కానీ ఇక్కడ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ని ఒక్క తమిళ ప్రజలకు మాత్రమే నచ్చే విధంగా తీర్చి దిద్దాడు. అయినా సినిమా లో పస ఉంటె ఎక్కడైనా ఆడుతుంది. తమిళం లో మంచి కథ, కథనం తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగులో వందరోజులు ఆడటమే అందుకు సాక్ష్యం. బాహుబలిని తమిళ్ లో ఆదరించారని, బలవంతంగా పొన్నియిన్ సెల్వన్ ని ఆదరించాలంటే ఎలా? కష్టం.

రాజమౌళి కూడా పొన్నియిన్ సెల్వన్ ని సినిమాగా తీయడం కష్టమని, అందుకే వెబ్ సిరీస్ చేయాలనుకున్నట్లు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. చాలా పెద్ద నవల ఈ పొన్నియిన్ సెల్వన్. సినిమా నిడివికి తగినట్లు మణిరత్నం ఇష్టమొచ్చినట్లు మార్పులు చేసి తీయడం కూడా సినిమాకి పెద్ద మైనస్. ఇంటర్వెల్ కే తెలుగు ప్రేక్షకులు బోరు ఫీల్ అవ్వడం, మలి సగం చూసాక సినిమాలో ఎం లేదు అని చెప్పడం సబబే గా. అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ సినిమాలో ఒక్క తెలుగు ఆర్టిస్టు కూడా లేడు గా! అయినా మణిరత్నం సినిమాల మీద పట్టు ఎప్పుడో కోల్పోయాడు. ప్రేమకథలూ, యాక్షన్ సినిమాలు తీయడం లో దిట్ట అయిన మణిరత్నం, ఇటువంటి చారిత్రిక చిత్రాన్ని ఎలా గొప్పగా తీయగలడు.