polling in biharకరోనా రక్కసి పొంచి ఉన్న తరుణంలో కూడా భారత దేశంలో ఒక ప్రముఖ రాష్ట్రం ఎన్నికలకు వెళ్లనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ పోలింగ్ అనుమతించడం వల్ల మొత్తం మూడు దశలలో ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 3న రెండో విడత , మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. కరోనా కారణంగా బహిరంగ సభలు, ర్యాలీలకు పర్మిషన్ ఉండదు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంటాయి. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది.

పోలింగ్ సమయం మరో గంట పెంచింది ఎన్నికల సంఘం. చివరి గంటలో కరోనా పేషెంట్లు… క్వారంటైన్ లో ఉండే వారికి తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఇస్తుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో బీహార్ లో కోడ్ అమలులోకి రాబోతుంది.