political party flags on mahatma gandhiఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు మరీ వరస్ట్ గా తాయారయ్యాయి. రాజకీయాల్లో ఒకరిని ఒకరు దూషించుకోవడం సర్వ సాధారణమే. కానీ ఇప్పుడు అవి హద్దులు దాటి జనాలకి విరక్తి తెప్పిస్తున్నాయి. తమ నాయకుడిని ఏదో ఒక తిట్టు తిట్టారని నిరసనకి దిగారు YSRCP కార్యకర్తలు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ నిరసనలో కూర్చొని చేసిన పని మాత్రం అందరికీ విఘటు తెప్పిస్తుంది.

కార్యకర్తలందరూ ఒక దగ్గర కూర్చొని మధ్య వేలు చూపుతూ చేసిన పని ఇప్పుడు అందరికీ చిరాకు తెప్పిస్తూ వీళ్ళు రాజకీయ నాయకులేనా అనిపించేలా చేస్తుంది. పైగా ఆ గుంపులో మహిళలు కూడా వేలు చూపిస్తూ ఫొటోలకి ఫోజిచ్చారు. ఇదీ మరీ దారుణం. అసలు ఇలాంటి యాక్టివిటీకి మహిళలు దూరంగా ఉంటారు. అలాంటిది మహిళా కార్యకర్తలతో ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఈ నాయకులూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు ?

అలాగే ప్రకాశం జిల్లా కనిగిరిలో మన జాతిపిత మహాత్మా గాంధి విగ్రహానికి దండలకు బదులు ఆ పార్టీ కండువాలు మేడలో వేశారు. నిజానికి విలువలు పాటించే గొప్ప వ్యక్తులకి గౌరవం ఇచ్చే పార్టీ మాది అంటూ తెగ డప్పు కొట్టుకునే పార్టీ కార్యకర్తలు ఇలా దారుణంగా బిహేవ్ చేస్తూ జనాల్లో వ్యక్తిరేకత తెచ్చుకుంటున్నారు.

జగన్ పార్టీ నాయకులు ఇదే తీరు కంటిన్యూ చేస్తే ఇక వచ్చే ఏడాది ఎన్నికల్లో పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.