political color to guntur child abuseదాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడిని మరిచిపోకముందే గుంటూరు జిల్లా మోదుకూరులో మరో దారుణం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. చుండూరు మండలం మోదుకూరులో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిపై తాపీ పని చేసే షేక్‌ నాగుల్‌మీరా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ వార్తను సాక్షి ఈరోజు మొదటి పేజీలో వేసింది. అయితే అత్యాచార ఖండన కంటే నిందితుడు టీడీపీ కార్యకర్తని అతణ్ణి కాపాడే ప్రయత్నం అక్కడి టీడీపీ నాయకులు చేస్తున్నారనేదే ప్రముఖంగా రాసింది. గతంలో దాచేపల్లి ఘటనలో కూడా ఇలానే నిందితుడు టీడీపీ వాడంటూ హడావిడి చేసింది. తరువాత అతను వైకాపా వాడని తేలింది.

అయితే అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన ఈ విషయంలో వాడు ఫలానా పార్టీ వాడని ఆరోపించడం, దాని బట్టి వేరే పార్టీల వారు కూడా అలాంటి ఆరోపణలే చెయ్యడం ఏ విధంగానూ బాధితులకు మంచిది కాదు. రాజకీయమే చెయ్యాలి అనుకుంటే మన రాజకీయ నాయకులకు అంశాలే కరువయ్యాయా?