Pudding Mink Rave Partyహైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో గత అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. అధికారులు పెద్ద మొత్తంలో మత్తుపదార్ధాలైన కొకైన్., గంజాయి., ఎల్ఎస్ డీ స్వాధీనం చేసుకున్నారు. పబ్ యజమానితో పాటు ఆ సమయంలో పబ్ లో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ గాయకుడు., సినీ., రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రముఖుల పిల్లలు పట్టుబడినట్లు మీడియాలలో పేర్లతో సహా వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లో నానాటికి డ్రగ్స్ కల్చర్ విస్తరించడానికి ఈ పబ్ కల్చర్ వేదికవుతుందనదానికి ఎటువంటి సందేహం లేదు. పెరుగుతున్న మత్తుపదార్ధాల వినియోగంతో సామాన్య ప్రజల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పబ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి విచారణ చేపడతామని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన ప్రముఖుల పిల్లలను ప్రాధమిక విచారం జరిపి., వారికి నోటీసులు అందచేసి అధికారులు ఇంటికి తరలించారు. ప్రస్తుతం వారు పోలీస్ స్టేషన్ నుండి బయటకి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.