Police booked case on actor rajasekharఈరోజు తెల్లవారు జామున హీరో రాజశేఖర్ ఒక రోడ్డు ప్రమాదానికి గురై ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ప్‌క్టర్ వెంకటేష్ కేసు నమోదు చేసి మీడియాకు దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. అర్ధరాత్రి 12.49 గంటలకు పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్‌పైకి రాజశేఖర్ కారు ఎంటర్ అయ్యారట.

1.20గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచరం అందటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి గురైన కారు రాజశేఖర్‌కు చెందిందిగా గుర్తించారట. అప్పటికే రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయారట. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు పోలీసులు.

అయితే మద్యం మత్తులో కారు నడిపారు అనే వాదనను పోలీసులు ఏకిభావించలేదు. కారులో ఎలాంటి మద్యం బాటిళ్లు లభించలేదన్న ఆయన.. సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే రాజశేఖర్ కు మద్యం తాగారా అనే పరీక్షలు చేసారా అనే దానికి పోలీసులు సమాధానం చెప్పలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో రాజశేఖర్‌ సీటు బెల్టు పెట్టుకోవడంతో పెద్ద గండమే తప్పిందట. గరుడవేగా సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆయన, ఆ తరువాతి సినిమా కల్కితో మరో ప్లాప్ మూటగట్టుకున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి అనే డైరెక్టర్ తో మరో సినిమా ప్రకటించినా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అటకెక్కించారని సమాచారం.