Centeral Government delaying Polavaramఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కధనం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై కీలకప్రకటన చెయ్యొచ్చు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్రం తన పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసి ప్రాజెక్టును తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

నిర్మాణం కేంద్రం చేపడితే భవిష్యత్తులో అది రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, అలాగే టీడీపీని ఇరుకునపెట్టవచ్చని బీజేపీ కేంద్రనాయకుల అభిప్రాయమట. పోలవరం రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన వరం అని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు.

కేంద్రం పరిధిలో ఉన్న జాతీయ ప్రాజెక్టులన్నీ నత్తనడకన నడుస్తున్నాయి కావున చంద్రబాబు పట్టుబట్టి పోలవరంను రాష్ట్రపరిధిలోకి తీసుకునివచ్చారు. దానికి అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణపనులు పరుగులు పెట్టించారు. ఇప్పుడు కేంద్రం దీనిపై రాజకీయం మొదలు పెడితే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.