pm-modi-banned-big-notes-bank-closed-2-daysదేశానికి సేవ చేసుకునే అవకాశం అందరికీ రాదూ… అన్ని సార్లు రాదూ..! దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలు ఒడ్డి పోరాడే జవాన్లకు, చిత్తశుద్దితో నిజమైన ప్రజాసేవ చేసే అతి కొద్ది మంది రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు, సైంటిస్టులకు తదితర రంగాలలో మాత్రమే దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు వారి ఇంట్లో సాధకబాధకాలే సరిపోతాయి గానీ, దేశం గురించి ఆలోచించే శక్తి ఉండదు. కానీ, ఒక రకంగా ఆ అవకాశాన్ని నేడు దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ కల్పించారు.

అవును… రెండు, మూడు రోజులు కాస్త ఇబ్బంది పడండి… అది మీ కోసం కాదు… దేశం కోసం అనుకుని సరిపెట్టుకోండి..! ఆ తర్వాత దేశ అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఒకటుందని మీకు లభించే సంతృప్తి ముందు ఆ రెండు రోజులు పడిన ఇబ్బందులు మధుర జ్ఞాపకాలుగా గుర్తుండి పోతాయి. నిజమే… ఉన్నట్లుండి దేశంలోని ముఖ్యమైన కరెన్సీని రద్దు చేస్తే… ప్రతి క్షణం డబ్బుతోనే నడిచే సామాన్య ప్రజానీకానికి కాస్త ఇబ్బందులు తప్పవు. కానీ, దానిని వ్యక్తిగతంగా తీసుకోవడం కంటే… దేశం కోసం అని గర్వపడితే… అందులో ఉండే మానసిక తృప్తి ముందు అంతా ‘బలాదూర్’ అని చెప్పాలి.

ఏయ్… ఏ నాయకుడో చనిపోతేనో లేక ఏ రాజకీయ పార్టీ బంద్ లకు పిలుపునిస్తేనో… ఉన్నట్లుండి రెండు రోజుల పాటు ఏమీ చేయకుండా ఇంట్లో ఉండట్లేదా..! ఇది కూడా అలాగే అనుకుని సరిపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే… భవిష్యత్తు తరాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అత్యంత సాహోసోపేతమైన నిర్ణయం ఇది. ఇలాంటి నిర్ణయానికి మేం సజీవ సాక్ష్యం అని భావితరాలకు గర్వంగా చెప్పుకునేలా ప్రవర్తించండి. కుటిల బుద్ధి గల రాజకీయ నాయకులూ ఎలాగూ దీనిని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, విజ్ఞత గల జనులు మాత్రం అలాంటి నీచబుద్దిని ప్రదర్శించకుండా… దేశ భవిష్యత్తు కోసం మోడీ నిర్ణయానికి జై కొడదాం… ఇబ్బందులను సర్దుకుపోదాం..!