Please give me another chance Trust us Jagan Government Requestవరుస వివాదాల్లో ఇరుక్కుని కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం జగన్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ అలవాటే. అయితే ఒకే వివాదం మీద ఏకంగా సుప్రీం కోర్టు దగ్గరకు వెళ్లి మూటికాయలు వేయించుకున్నా మారకపోవడం దారుణం.

తాజాగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో పిల్‌ వేశారు. దీని మీద హై కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

దీంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే గతంలో కూడా ఇలాగే అన్నారు అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చెయ్యగా… భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జి.కె.ద్వివేది హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.

ప్లీజ్ ఇంకో అవకాశం ఇవ్వండి… మమ్మల్ని నమ్మండి అన్నట్టుగా కోర్టుని అభ్యర్ధించి ఈ విషయంగా కోర్టు ధిక్కారణ శిక్ష పడకుండా ప్రభుత్వం తప్పించుకుంది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు వేయ‌డం వ‌ల్ల ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి ఉంటుంది అనేదానిని రాజకీయ విశ్లేషకులు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. అటువంటిది ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుకుపోతుందో అర్ధం కాని పరిస్థితి.