Plane crashes in Colombia Brazilian football team deadబ్రెజిల్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సహా 75 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎవరూ ఊహించలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూలింది. విమానంలో ఇంధనం లేక యూఎస్ లోని సెర్రో గోర్డో ప్రాంతంలో రాత్రి 10:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9:45 గంటలకు) క్రాష్ అయింది.

కోపా సుడామిరికానా ఫైనల్స్ ఆడేందుకు చాపకోయిన్సీ జట్టు ఈ విమానంలో వెళుతోంది. కొలంబియాలో రెండో అతి పెద్ద విమానాశ్రయమైన జోస్ మారియా కోర్డోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇది ల్యాండ్ కావాల్సి వుంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ ‘కాన్మీబోల్’ టోర్నీని నిలిపివేస్తున్నట్టు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ ప్రమాదంలో విమానం పరిస్థితి ఏంటి? ఎవరైనా బతికున్నారా? ఎక్కడ క్రాష్ ల్యాండయిందన్న విషయం తెలియాల్సి వుంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఫుట్ బాల్ జట్టులోని ఓ ఆటగాడు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్న ఫోటో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. పరిస్థితి చూస్తుంటే… అత్యంత విషాదకరమైన వార్త వినేందుకు బ్రెజిల్ మానసికంగా సిద్ధం కావాలన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.