Pizza 2 Thriller Trailer Talkఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తెలుగులో ఘనవిజయం అందుకున్న డబ్బింగ్ సినిమాలలో “పిజ్జా” కూడా ఒకటన్న విషయం సినీ విజ్ఞులకు తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తమిళంలో తెరకెక్కిన “పురియాత పుతిర్” సినిమాను “పిజ్జా 2”గా తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను బాగా కట్ చేసారు. చూడగానే ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. థ్రిల్లింగ్ సన్నివేశాల గురించి చెప్పడం కంటే చూస్తేనే మంచి అనుభూతి వస్తుంది. అలాంటి అనుభూతిని పంచడంలో ‘పిజ్జా 2’ ట్రైలర్ ప్రేక్షకులను పడేస్తుంది. అలాగే ‘నెవర్ సీన్ స్టోరీ’ అంటూ టైటిల్ క్రింద ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.