Piya More Song Baadshahoచారిత్రాత్మక అంశంతో తెరకెక్కుతోన్న “బాద్ షాహో” సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది. అందులో భాగంగా తాజాగా సన్నీలియోన్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించిన ‘పియా మోరే మోరే’ అన్న వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ ఏడాదిలో విడుదలైన ఐటమ్ సాంగ్స్ లో ది బెస్ట్ సాంగ్ గా కీర్తింపబడుతున్న ఈ పాట నెటిజన్లను ఓ ఊపు ఊపుతోంది.

అంకిత్ తివారి మాంచి ఊపు తెచ్చే సంగీతాన్ని అందించగా, మికా సింగ్, నీతి మోహన్ ల స్వరం మాస్ అప్పీల్ ను ఇచ్చాయి. ఇక వీడియో పరంగా సన్నీ సిజ్లింగ్ పెర్ఫార్మన్స్ అదనపు ఆకర్షణ. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి – పోర్న్ బ్యూటీ సన్నీలియోన్ ల మధ్య రొమాన్స్ ఫుల్ గా పండడంతో వీక్షకులను ఆకర్షించడంలో వింతేమీ లేదు. హాఫ్ బీట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ డోస్ తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునేందుకు సన్నీలియోన్ కు మంచి అవకాశమే లభించినట్లుంది. అలాగే దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లే ఈ పాట స్పష్టం చేస్తోంది.