Pinipe-Krishnareddy“నీ రెండు కాళ్ళు విరిచేస్తా… నిన్ను చంపేస్తా. నీ తల్లిని, పెళ్ళాంని నీ ఇంటితో సహా పెట్రోల్ పోసి సహా తగలబెడతా. నీకు నీ తల్లీ, పెళ్ళాం బ్రతకాలని లేదా…రా?నేను మా నాన్నలా అమాయకుడిని కాను… అందరినీ అడ్డంగా నరికి పారేస్తా.. ఏమనుకొన్నావో? కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరే ఉంటుంది. దానిని మార్చం. అయినా కోనసీమకు ఎవరి పేరు పెడితే నీకెందుకురా నా…కొడకా?” ఇవన్నీ మంత్రి విశ్వరూప్ సుపుత్రుడు కృష్ణారెడ్డి తమ సొంత పార్టీకే చెందిన ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరిస్తో ఫోన్‌లో మాట్లాడినా మాటలు. అతను సత్తిబాబుని ఇంకా చాలానే అన్నాడు వాటిలో ఇవి మచ్చుకు మాత్రమే.

అడపా సత్తిబాబు తాను ఎటువంటి తప్పు చేయలేదని మంత్రి ఇంటికి నిప్పు పెట్టినవారిలో తాను లేనని కనుక తనపై అంత నిందలు వేయవద్దని ఎంతగా బ్రతిమాలుకొంటున్నా మంత్రి కొడుకు కృష్ణారెడ్డి ఆయనపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.

బహుశః దాంతో సత్తిబాబులో కూడా సహనం కూడా నశించిపోయిందేమో …కృష్ణారెడ్డి బెదిరింపుల వాయిస్ రికార్డింగ్‌ను తన సన్నిహితులకు ఫార్వర్డ్ చేశారు. వారు దానిని సోషల్ మీడియాలో పెట్టేయడంతో జిల్లాలో కలకలం మొదలైంది.

అది విన్నవారు మంత్రి కొడుకా మజాకా?వాళ్ళకి కోపం వస్తే ఎవరినైనా చంపేయవచ్చు…. సజీవ దహనం చేసేయవచ్చన్న మాట! అని అనిపించకమానదు. ఫోన్‌లో కృష్ణారెడ్డి మాట్లాడిన ఈ మాటలను వింటే అర్ధమవుతుంది.

ఇంతవరకు కోనసీమ అల్లర్ల వెనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఉన్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అమలాపురం అల్లర్లకు సంబందించి పోలీసులు కేసులు నమోదు చేసినవారిలో ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబు కూడా ఉన్నారు.

ఇప్పుడు మంత్రి విశ్వరూప్ పుత్రరత్నం కృష్ణారెడ్డి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుని బెదిరిస్తూ మాట్లాడిన ఈ మాటలు వింటే కోనసీమ అల్లర్లు కొందరి భావోద్వేగాలతో జరిగినవని, వాటిలో పార్టీలకు అతీతంగా వైసీపీకి చెందినవారు కూడా పాల్గొన్నారని అర్ధమవుతోంది. కానీ ఈ నిందను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై వేసి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించినట్లు అర్ధమవుతోంది. జగన్ ప్రభుత్వం ఒకటి తలిస్తే మంత్రిగారి పుత్రరత్నం కృష్ణారెడ్డి ఆవేశంలో అసలు విషయం బయటపెట్టేశాడు. ఇప్పుడు దీనిని కవర్ చేసుకోవడానికి ఏం స్టోరీ చెపుతారో చూద్దాం.