PIL on missing Indian currency between printing presses and RBIఒక ఆర్టీఐ కార్యకర్త వేసిన కొన్ని వేరువేరు ఆర్టీఐ పిటిషన్లు సంచలన విషయాన్ని బయటపెట్టింది. నోట్ల రద్దుకు కొంచెం ముందు ఇరవైమూడువేల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ గల్లంతైందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే దీనిని ఆర్బీఐ కూడా ధృవీకరించింది.

పెద్ద నోట్ల రద్దుకు ముందు 23 వేల కోట్లు ప్రింట్‌ అయ్యాయని, కానీ అవేమీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చేరుకోలేదని వెల్లడవడం విశేషం. ప్రింటింగ్ ప్రెస్సులు పంపించాం అని చెబుతున్న దానికి, ఆర్బీఐ మాకు అందాయి అని చెబుతున్న దానికి 23 వేల కోట్లు తేడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే ఒక పెద్ద స్కామ్ అనే అనుకోవాలి.

ఆ స్కామ్ ను కప్పిపుచ్చడానికే నోట్ల రద్దు చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఆర్బీఐ, ఇతర ప్రింటింగ్‌ ఇన్‌స్టిట్యూషన్లు కరెన్సీ నోట్లపై ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయంపై ఆ ఆర్టీఐ కార్యకర్త 2015 లోనే ఓ పిల్‌ దాఖలు చేశారు. ఆ ప్రజా ప్రయోజాన వ్యాజ్యం నేడు బొంబై హైకోర్టు ముందుకు విచారణకు రానుంది.