Petta movie producers happy  for vinaya vidheya rama దాదాపుగా గత వారం రోజుల నుంచి పేట తెలుగు సినిమా నిర్మాతలకు…థియేటర్స్ మాఫియా కి మధ్య నానా రభస జరుగుతుంది. పేట సినిమాకి కావాలనే థియేటర్స్ లేకుండా చేశారు దిల్ రాజు, అల్లు అరవింద్ అంటూ రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సినిమా విడుదల తర్వాత ఆ విమర్శలు చేసిన పేట నిర్మాతలు చాల హ్యాపీ అనుకుంట…

ఎందుకంటే పేట సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పాత రజనిని చూసాం అంటూ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఆయన ఫాన్స్. ఇక సినిమా మంచి టాక్ రావడంతో స్లో గా థియేటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరో పక్క వినయ విధేయ రామ డిజాస్టర్ కావడంతో మరో రెండు రోజుల్లో వరుసగా థియేటర్స్ ఖాళి అవ్వక తప్పదు. అయితే పేట తెలుగు ఆడియప్ వేడుకలో ఆ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ ఈ థియేటర్స్ మాఫియాని దేవుడు చూసుకుంటాడు అని, తగిన శాస్తి జరుగుతుంది అని తెలిపిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ కావడంతో తమకు థియేటర్స్ ఇవ్వకుండా చేసిన కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి తగిన శాస్తే జరిగింది అని, ఎందుకంటే సదరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ వినయ విధేయ రామ సినిమాని భారీ రేట్స్ కి కొన్నారు అని, సినిమా భారీ హిట్ అయితే కానీ, బ్రేక్ ఈవెన్ అవదు అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కష్టం అందుకే వాడికి దేవుడు తగిన శాస్తి చేసాడు అని సదరు పేట నిర్మాతలు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట.