Petta-First-Look-Poster---Rajinikanthసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన గత మూడు సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. విడుదలకు ముందు భారీ హైప్ రావడం… విడుదల తర్వాత మొదటి రోజే చతికిలపడేలా సినిమాలు ఉండడంతో… ఒక విధంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ నీరసించిపోయారు. దీనికి తోడు శంకర్ దర్శకత్వం వహిస్తోన్న “2.0” వాయిదాలు పడుతూ రావడం అభిమానులను మరింత కృంగదీసింది.

ఈ తరుణంలో సూపర్ స్టార్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అందులో ఒక సినిమాకు సంబంధించిన తాజాగా అప్ డేట్ రావడంతో నూతన ఉత్తేజంతో ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న “పెట్టా” సినిమా అఫీషియల్ మోషన్ పిక్చర్ ను చడిచప్పుడు లేకుండా నేడు విడుదల చేసారు.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందన్న రీతిలో ఈ ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ఉంది. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ అభిమానులకు కావలసినంత హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ ను తమ బ్యాక్ గ్రౌండ్ తో ఇంతగా ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ లేరు. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.