petrol prices in indiaఅరబిక్ దేశాల్లో 20 రూపాయలకే లభించే పెట్రోల్ మన దేశంలో 65 – 70 రూపాయలుగా ఉంటాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర విపరీతంగా తగ్గుతున్నా మన దేశంలో మాత్రం ఆ ఒడిదుడుకుల ప్రభావం పెద్దగా కనపడడం లేదు. నిజానికి 1 లీటర్ పెట్రోల్ ఉత్పత్తి కావడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 24.75 పైసలు. దీనికి రవాణా, ఇతర ఖర్చులు, లాభాలు జతచేరిస్తే షుమారుగా 27.74 పైసలు. అదనంగా 2.26 డీలర్ కమీషన్ కలుపుకుంటే లీటర్ పెట్రోల్ ఉత్పత్తికి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వలన ఈ మొత్తం 65 రూపాయలకు చేరుకుంటోంది.

కేంద్రం విధించే సుంకం 19.06 కాగా, రాష్ట్రం వాటా క్రింద మరో 12.14 ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులలో తేడాలు ఉండడంతో ఆయా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలలో వ్యత్యాసం ఉంటోంది. మొత్తంగా కూడి వినియోగదారునికి తడిసి మోపెడు అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో తగ్గుముఖం పట్టకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెట్రోల్ కంపెనీలు ప్రతి 15 రోజులకోకసారి ధరలను సమీక్షించినప్పటికీ, ప్రభుత్వాలు మాత్రం పన్నుల విధానంలో అవలంభిస్తున్న తీరుతో వాహన చొదకుల జేబులు ఖాళీ అవుతున్నాయన్నది వాస్తవం.