petrol-and-diesel-prices-goes-down-in-andhra-pradeshరోజురోజుకు పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయిల చప్పున తగ్గించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. రేపు ఉదయం నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి.

వ్యాట్‌ తగ్గింపుతో రాష్ట్రానికి 1120 కోట్ల ఆదాయం తగ్గనుంది అయినా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేంద్రంపైనా, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల పైనా ఒత్తిడి పడే అవకాశం ఉంది.

కేవలం రాజస్థాన్ మినహా ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా ఇప్పటివరకు ధరలు తగ్గించలేదు. రెండు నెలలలో ఎన్నికలు ఉండటంతో రాజస్థాన్ ప్రభుత్వం ధరలను తగ్గించింది. ఇప్పుడు మిగతా వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటిదాకా టీడీపీ వారు ధరలపై విమర్శిస్తున్నప్పుడల్లా ముందు మీరు చెయ్యండి అని బీజేపీ వారు తప్పించుకునే వారు.