Petrol diesel prices in Andhra Pradeshమోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. లీటరు పెట్రోల్ రూ.5, లీటర్ డీజీల్ మీద రూ. 10 చొప్పున తగ్గించింది. దీంతో ఇంధన ధరలు భారీగానే తగ్గాయి.

పెట్రోలు, డీజీల్ సెంచరీ దాటి వినియోగదారులకు షాకిస్తున్న సమయంలో కేంద్రం ఎక్సై్ డ్యూటీని తగ్గించి కాస్తంత ఉపశమనం కల్పించింది.

మోడీ సర్కార్ గత మూడేళ్లలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇదే మొదటిసారి. దీంతో చాలా రాష్ట్రాల్లో డీజీల్ పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన ఛార్జీలు తగ్గిస్తాయని సగటు వినియోగదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పెట్రోలు, డీజీల్ ధరలను తగ్గించాయి.

అసోం, గోవా, త్రిపుర, కర్నాటక, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి.

దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇంధనం ధరలు మరింత తగ్గాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

పెట్రోలు, డీజీల్ ధరలు పక్కన పెడితే…జగన్ సర్కార్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధనం ధరలు సామాన్యునికి షాకిస్తుంటే…సామాన్యునిపై కరెంట్ ఛార్జీల రూపంలో మరో షాకిచ్చేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ట్రూఅప్ ఛార్జీల కింద రూ. 528.71కోట్లు వసూలు చేసేందుకు ట్రాన్స్ కో సిద్దమైందట. 2014-15 నుంచి 18-19 మధ్య నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాలకు మొత్తం రూ. 528.71 కోట్లు మేర అధిక వ్యయం అయిందని ….ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేలా ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని ట్రాన్స్ కో కోరింది. ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేసింది.

సామాన్య, మధ్య తరగతి ప్రజలను గట్టేక్కించేందుకు జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది…? పెట్రోల్, డీజీల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ….ఊరట కల్పిస్తుందా…? ఇంధనం ఛార్జీలతోపాటుగా కరెంటు ఛార్జీలు పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తుందా..? వేచి చూడాల్సిందే…!!