petition in high court on saaho mocie over ticket pricingయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. 350 కోట్ల పెట్టుబడి పెట్టడంతో ఓపెనింగ్స్ ఎంత ఎక్కువగా రాబడితే అంత మేలని చిత్రబృందం భావిస్తుంది. ఎక్స్ ట్రా షోలు, ఎక్కువ రేట్లతో వీలైనంత ఎక్కువ రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో సినిమా టికెట్‌ ధరలను పెంచకుండా థియేటర్‌ యాజమాన్యాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని కోర్టు విచారించి ప్రతివాదులుగా ఉన్న సాహో చిత్ర పంపిణీదారు శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్‌ అధినేత దిల్‌రాజుతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. సరిగ్గా రిలీజ్ కు ఒక్క రోజు ముందు విచారణ కాబట్టి కోర్టు ఇచ్చే రూలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ పిటిషన్లు వేసిన వారిలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్‌ కూడా ఉండడం విశేషం. ఇది ఇలా ఉండగా సాహూ బుకింగ్లు ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. చాలా చోట్ల పెంచిన రేట్లతోనే అమ్మేస్తున్నారు. పెట్టిన టిక్కెట్లు పెట్టినట్టుగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బ్రేక్ ఈవెన్ కు సినిమా అన్ని భాషల్లోనూ కలిపి 290 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలలోనే 124 కోట్లు రాబట్టాల్సి ఉంది. దీనితో అందరి కళ్ళు 30వ తారీఖున విడుదల అయ్యే ఈ సినిమా మీదే ఉంది.