Vemula Prashanth Reddy commentsఏపీ – తెలంగాణా రోడ్డు రవాణా శాఖ మంత్రుల నడుమ మాటలు తూటాలు పేలుతున్నాయి. ముందుగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ… “రాష్ట్ర విభజన జరిగితే అడుక్కు తింటారని అన్న ఆంధ్రోళ్లే… ఇప్పుడు నిధులు లేక సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని అడుక్కు తింటున్నారు. రోజు గడవాలంటే లోన్ కావాల్సిందే… లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడవదు” అంటూ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేసారు.

దీనికి కౌంటర్ గా ఏపీ మంత్రివర్యులు పేర్ని నాని కూడా తన గళాన్ని విప్పారు. ‘నిజమే… తాము నిధుల కోసమని కేంద్రాన్ని భిక్షం ఎత్తుకుంటున్నామని, మరి కేసీఆర్ ఏం అడుక్కుంటానికి వెళ్తున్నాడు? మాటమాటాకి కేంద్రాన్ని ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని, కేంద్రంలో చేరాలని, కేంద్ర మంత్రులుగా కావాలని ఎందుకు మంతనాలు చేస్తున్నారో చెప్పాలని’ విమర్శించారు.

ఈ ‘అడుక్కుతినే’ మాటలు విమర్శల ఎలా ఉన్నా… మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శించడానికి అవకాశం ఇచ్చే విధంగా ఏపీ పాలన సాగుతుండడం అనేది జీర్ణించుకోలేని అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్న భావన ఏపీ ప్రజల్లోకి క్రమంగా బలపడుతుండడం అనేది దేనికి సంకేతాలో అధికార పార్టీయే అర్ధం చేసుకోవాలి మరి!