People are dying we want our publicityతిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా పదకొండు మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ఆ ఘటనలో చనిపోయింది 31 మంది అని… తెలుగుదేశం పార్టీ ఒక లిస్టు విడుదల చేసింది. మృతుల పేర్లు, ఊర్ల డీటెయిల్స్ తో పాటు లిస్ట్ మీడియా ముందు ఉంచారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

సహజంగా ప్రతీ విషయంలోనూ ఎదురుదాడి చేసే అధికార పార్టీ ఈ విషయంలో ఎందుకనో సైలెంట్ అయిపోయింది. మరోవైపు… రైతు భరోసా అంటూ 3,030 కోట్లు విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది జగన్ ప్రభుత్వం. కరోనా కాలంలో ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా ఈ పప్పు బెల్లాల పందేరం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు.

సరే ఎవరికో ఒకరికి లబ్ది చేకురుతుంది కదా… ఆ మాట వదిలేద్దాం. రైతు భరోసా ఇస్తున్నాం అంటూ ఈ రోజు తెలుగు, ఇంగ్లీష్ పత్రికలలో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చింది ప్రభుత్వం. దీనికి కనీసం 25-30 కోట్లు ఖర్చు పెట్టి ఉండవచ్చు. సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళవచ్చు మరి ఈ పబ్లిసిటీ ఎవరికీ ఉపయోగం.

అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా తాము సంక్షేమ పథకాలు ఆపడం లేదు అని గొప్పలు చెప్పుకునే వారు, ఈ దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నట్టు? ఆ నిధులతో కనీసం ప్రతి జిల్లాలోను ఒక కోవిడ్ కేర్ సెంటర్ సులువుగా పెట్టవచ్చు. జనాలు చచ్చిపోతున్నా… మన పబ్లిసిటీ మనకు గావాలే అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.