An-Emotional-And-Situational-Peniviti-Song-in-Aravindha-Samethaభారీ అంచనాల నడుమ “అరవింద సమేత” రెండవ పాట ‘పెనివిటీ’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఎస్.ఎస్.థమన్ నుండి వెలువడిన ఓ డిఫరెంట్ ట్యూన్ కు… రామజోగయ్య శాస్త్రి అందించిన అత్యద్భుతపు సాహిత్యం… కాలభైరవ స్వరం… కలగలిపి ఓ మంచి పాటను తెలుగు ప్రేక్షకులకు అందించారు.

వెళ్ళిపోయిన తన భర్త రాక కోసం నిరీక్షించే ఓ సతీమణి పడే ఆవేదేనే ఈ ‘పెనివిటీ’ సాంగ్. జూనియర్ ఎన్టీఆర్ కడుపున పడిన సమయంలో ఇల్లు విడిచివెళ్ళిపోయిన పతి కోసం ఆరాటపడుతూ సాగిన ఈ పాటలోని రామ్ జో అందించిన సాహిత్యం… ముందుగా చెప్పిన విధంగా నిజంగానే గుండెలు పిండేసేలా ఉంది.

ముఖ్యంగా రాయలసీమ యాసలో సాగడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. అలాగే లిరికల్ వీడియోలో చూపించిన ఆర్టిస్టిక్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా (నాలుగు పాటలున్న) ఫుల్ ఆల్బమ్ రేపు (గురువారం నాడు) విడుదల కానుంది.