Priyadarshi, Comedian Priyadarshi Mahesh Babu, Comedian Priyadarshi Mahesh Babu Movie, Comedian Priyadarshi Mahesh Babu Murugadoss Movie, Pelli Choopulu Comedian Priyadarshi Mahesh Babu Murugadoss Movieమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకు ఒక స్మాల్ బ్రేక్ వచ్చింది. ఓ పక్కన మురుగదాస్ తన ‘అఖిరా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా, మరో వైపు ప్రిన్స్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ చెక్కేసి, ఇటీవలే హైదరాబాద్ చేరుకుని వినాయకచవితి పర్వదినాన్ని జరుపుకున్నారు. 7వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నాడు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో కమెడియన్ గా ప్రియదర్శి ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, తన కెరీర్ తొలినాళ్ళల్లోనే ప్రిన్స్ సినిమా దక్కించుకోవడం విశేషం. ‘పెళ్లిచూపులు’ సినిమాలో వన్ లైన్ డైలాగ్స్ తో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను నవ్వించిన ప్రియదర్శి కెరీర్ మరో మలుపు తిరిగింది.

ఈ సినిమాకు ఉన్న మరో స్పెషల్ ఏమిటంటే… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండడంతో, ప్రియదర్శి జీవితానికి చాలా కీలకం కాబోతోంది. రెండవ సినిమాతోనే భారీ జాక్ పాట్ అందుకున్నాడంటూ సినీ వర్గీయులు కొనియాడుతున్నారు. అయితే ప్రియదర్శి ఎంపికపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.