Peddireddy Ramachandra Reddy about Tirupati by-election votingమీడియా సాక్షిగా తిరుపతి ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరుగుతుందని బయటపడటంతో అధికార పార్టీ డిఫెన్స్ లో పడింది. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీడియా ముందు మాట్లాడటానికి ఇబ్బంది పడినట్టు స్పష్టంగా కనిపించింది. “ప్రయాణికులను చూపి దొంగ ఓట్లు అంటూ చిత్రీకరించడం సిగ్గుచేటు. పేదవాళ్లు బస్సుల్లో వెళ్లకుండా విమానాల్లో వెళ్తారా?,” అంటూ మండిపడ్డారు.

ఎప్పటిలాగే నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ప్రతిజ్ఞ చేశారు. అయితే పెద్దిరెడ్డి చెప్పినట్టు పేదవాళ్ళు బస్సుల్లోనే తీర్థయాత్రలకు వెళ్తారు. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. పేదలు వెళ్తే ఆర్టీసీ బస్సులలో వెళ్తారు కానీ అక్కడ ఉన్నవి ప్రైవేటు బస్సులు. పైగా ఏ ఒక్కరి వద్దా టిక్కెట్ లేదు.

కనీసం ఫ్రీ ట్రిప్ ఎవరైనా వేశారా అంటే కూడా సమాధానం లేదు. శ్రీకాళహస్తి వెళ్తున్నాం అని చెప్పిన కొంతమంది వారి సొంత ఊరు అసలు తిరుపతి కూడా రానవసరం లేకుండా అరగంటలో శ్రీకాళహస్తి వెళ్లే అవకాశం ఉన్న వారు. వారు చుట్టుతిరిగి తిరుపతి ఎందుకు వచ్చారు అంటే సమాధానం లేదు.

ఇదంతా పక్కన పెడితే తిరిగి తమ ఊర్లకు వెళ్తున్న కొన్ని బస్సులలో తీర్థయాత్ర అని చెప్పిన వారి కుడి చేతి చూపుడు వేలుకి ఇంకు మార్కు వేసి ఉండటం… ఇటీవలే మునిసిపల్ ఎన్నికలలో ఎడమచేతి చూపుడు వేలుకి ఇంకు మార్కు వెయ్యడంతో ఈ సారి తిరుపతి ఉపఎన్నికలలో కుడి చేతి చూపుడు వేలుకి ఇంకు మార్కు వెయ్యాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.